Medipally: కోడిపందేల స్థావరంపై మేడిపల్లి పోలీసుల దాడి!
Medipally: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్ల మండి ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్న ఇద్దరిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
Medipally: కోడిపందేల స్థావరంపై మేడిపల్లి పోలీసుల దాడి!
మేడిపల్లి: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల సమీపంలోని మండి ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్న ఇద్దరిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు చెంగిచర్ల మండి ప్రాంతంలో దాడులు నిర్వహించి కోడిపందేలు నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితుల వద్ద తనిఖీలు నిర్వహించగా రూ.3,005 నగదు, రెండు సెల్‌ఫోన్లు లభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. చట్టవిరుద్ధంగా కోడిపందేలు, జూదం నిర్వహించడం లేదా వాటిలో పాల్గొనడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ జలేందర్ రెడ్డి హెచ్చరించారు.