Attapur: జాయ్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి!
Attapur: అత్తాపూర్ జాయ్ ఆసుపత్రిలో జ్వరంతో చేరిన మహిళ చికిత్స పొందుతూ మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల భారీ ఆందోళన, ఉద్రిక్తత.
Attapur: జాయ్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి!
Attapur: గ్రేటర్ హైదరాబాద్ అత్తాపూర్ జాయ్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందని బంధువుల ఆందోళన.
అత్తాపూర్ పరిధిలోని జాయ్ హాస్పిటల్ వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జ్వరం అని హాస్పిటల్‌లో చేరిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడంతో, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు.
స్థానికంగా ఉండే శ్రీలత (28) అనే మహిళకు నిన్న జ్వరం రాగా కుటుంబ సభ్యులు ఆమెను అత్తాపూర్ సమీపంలోని జాయ్ హాస్పిటల్‌లో చేర్పించారు. నిన్నటి నుంచి చికిత్స అందిస్తున్నామని చెప్పిన ఆసుపత్రి యాజమాన్యం, రాత్రి సమయానికి పరిస్థితి విషమంగా ఉందంటూ ఐసీయూ (ICU)కి తరలించారు. ఆ తర్వాత శ్రీలత మృతి చెందినట్లు ప్రకటించడంతో బంధువులు షాక్‌కు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ.