Gudipadu: గుడిపాడులో హిందూ స్మశాన వాటిక ప్రారంభం
Gudipadu: దువ్వూరు మండలం గుడిపాడులో నూతనంగా నిర్మించిన హిందూ స్మశాన వాటికను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు.
Gudipadu: గుడిపాడులో హిందూ స్మశాన వాటిక ప్రారంభం
గుడిపాడులో హిందూ స్మశాన వాటికను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
మైదుకూరు, దువ్వూరు
దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హిందూ స్మశాన వాటికను మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. స్థానిక ప్రజల సౌకర్యార్థం సకల వసతులతో ఈ స్మశాన వాటికను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల, పట్టణ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో టిడిపి మండల కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి, దువ్వూరు పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబు, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కోనేటి హరినాథ్, సొసైటీ చైర్మన్ పోలు రామ్మోహన్ రెడ్డి కడప జిల్లా టిడిపి మాజీ ఉపాధ్యక్షులు చీదిరి నరసింహ రాయల్ ఉన్నారు.
అలాగే పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, శెట్టి నాగరాజు, పొలిమేర రవీంద్ర, బందే ఖాన్ లతో పాటు పలువురు మండల స్థాయి టిడిపి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.