Mangalagiri: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విప్ బెందాళం అశోక్!
Mangalagiri: మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కలిశారు.
Mangalagiri: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విప్ బెందాళం అశోక్!
Mangalagiri: ఇచ్ఛాపురం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇచ్ఛాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కంచిలి మండలంలోని సుంకులి సాగరం, గంగసాగరం ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆయా ప్రాజెక్టుల ప్రాధాన్యతను, స్థానిక రైతుల అవసరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించారు. సుంకులి సాగరం, గంగసాగరం ప్రాజెక్టులకు త్వరలోనే నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు విప్ బెందాళం అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.