TG Inter Supplementary Exams 2026: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
TG Inter Supplementary Exams 2026: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. మే 13 నుంచి 21 వరకు పరీక్షలు జరగనున్నాయి.
TG Inter Supplementary Exams 2026: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
TG Inter Supplementary Exams 2026: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని వారు మరియు మార్కులు పెంచుకోవాలనుకునే (Improvement) విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 13 నుంచి మే 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు.
ముఖ్యమైన తేదీలు & వివరాలు:
పరీక్షల కాలం: మే 13 నుంచి మే 21, 2026.
ఈ నెల 13 నుంచి 20 వరకు సంబంధిత కాలేజీల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రాక్టికల్స్: మే 22 నుంచి మే 25 వరకు.
ప్రత్యేక పరీక్షలు: మే 26న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, ఎథిక్స్ పరీక్ష.. మే 28న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది.
పరీక్షా సమయాలు:
ఫస్టియర్: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.
సెకండియర్: మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు.
సప్లిమెంటరీ టైమ్ టేబుల్ (మే 2026):
మే 13– సెకండ్ లాంగ్వేజ్
మే 14 – ఇంగ్లిష్
మే 15 – మ్యాథ్స్ ఏ, బోటనీ , పొలిటికల్ సైన్స్
మే 16– మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ
మే 18 – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 19 – కెమిస్ట్రీ, కామర్స్
మే 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్
మే 21 – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ