TG Inter Results 2026: రేపే ఇంటర్ రిజల్ట్స్.. చెక్ చేసుకోండి ఇలా!
TG Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై క్లారిటీ వచ్చేసింది. ఈ ఆదివారం ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి ప్రకటించారు.
TG Inter Results 2026: రేపే ఇంటర్ రిజల్ట్స్.. చెక్ చేసుకోండి ఇలా!
TG Inter Results 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్కంఠకు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఈ ఆదివారం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు.
ఫలితాల విడుదల ఇలా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన నివాసంలోనే ఫలితాల సీడీని అధికారికంగా విడుదల చేస్తారు. ఒకవేళ సీఎం అందుబాటులో లేని పక్షంలో, నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.
రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి?
విద్యార్థులు తమ ఫలితాలను విడుదలైన వెంటనే కింది వెబ్‌సైట్లలో తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు:
అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ను సందర్శించండి.
'TS Inter Results 2026' లింక్‌పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
మీ ఫలితాలు మరియు మార్క్స్ మెమో స్క్రీన్ పై కనిపిస్తాయి.
ఫలితాల వెల్లడి తర్వాత మార్కుల మెమోలను కూడా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని బోర్డు కల్పించనుంది. సాధ్యమైనంత త్వరగా ఫలితాల ప్రక్రియను పూర్తి చేసి, ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా వెల్లడించేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.