AP and TG Inter Results 2026: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్.. ఏప్రిల్‌లోనే రిజల్ట్స్!
AP and TG Inter Results 2026: ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు బోర్డులు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ మొదటి, మూడో వారాల్లో రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు ఇవే!
AP and TG Inter Results 2026: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్.. ఏప్రిల్‌లోనే రిజల్ట్స్!
AP and TG Inter Results 2026: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖలు ఫలితాల విడుదలకు కసరత్తును ముమ్మరం చేశాయి. ఏప్రిల్ రెండో వారంలోపు రెండు రాష్ట్రాల్లోనూ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ (TGBIE) ఇంటర్మీడియట్ ఫలితాల అప్‌డేట్:
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి ప్రారంభమైన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది.
అంచనా తేదీ: అధికారులు సాధ్యమైనంత వరకు ఏప్రిల్ 6న ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైతే, ఏప్రిల్ 10 లోపు ఖచ్చితంగా వెల్లడించనున్నారు.
వెబ్‌సైట్: విద్యార్థులు tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ ఫలితాల చెకింగ్ విధానం:
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక పోర్టల్ ద్వారా పొందవచ్చు.
1. మొదటగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లేదా tgbie.in సందర్శించాలి.
2.హోమ్ పేజీలో కనిపించే ‘Inter Results 2026’ లింక్ పై క్లిక్ చేయాలి.
3. అక్కడ విద్యార్థి తన హాల్‌టికెట్ నెంబర్ ను నమోదు చేయాలి.
4.‘Submit’ బటన్ పై క్లిక్ చేయగానే మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
5. భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్ కాపీని ‘Download’ లేదా ‘Print’ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఇంటర్మీడియట్ ఫలితాల అప్‌డేట్:
ఏపీలో మార్చి 21 నుంచి మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 14 నాటికి పేపర్ల దిద్దడం పూర్తి చేసి, ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
అంచనా తేదీ: ఏప్రిల్ 21 లోపు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: విద్యార్థులు bie.ap.gov.in లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన AP వాట్సాప్ మిత్ర (91 95523 00009) ద్వారా కూడా నేరుగా రిజల్ట్స్ పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్ (AP) ఇంటర్ ఫలితాల చెకింగ్ విధానం:
ఏపీ విద్యార్థులు వెబ్‌సైట్‌తో పాటు సరికొత్తగా వాట్సాప్ ద్వారా కూడా తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్ ద్వారా: విద్యార్థులు resultsbie.ap.gov.in లో నేరుగా హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూడొచ్చు.
వాట్సాప్ (మనమిత్ర) ద్వారా:
1. మీ మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపాలి.
2. రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ను ఎంచుకోవాలి.
3. ఆ తర్వాత ‘Education Services’ ఆప్షన్ క్లిక్ చేయాలి.
4. ‘ఇంటర్ పరీక్షల ఫలితాల డౌన్‌లోడ్’ ఆప్షన్ ఎంచుకుని, మీ హాల్‌టికెట్ నెంబర్ నమోదు చేయాలి.
5. వెంటనే మీ మార్కుల షార్ట్ మెమో పీడీఎఫ్ (PDF) రూపంలో వాట్సాప్‌కు అందుతుంది.
సప్లిమెంటరీ పరీక్షలు:
జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, మే 31 నాటికే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా పూర్తి చేయాలని రెండు రాష్ట్రాల బోర్డులు భావిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులకు ఉన్నత చదువుల ప్రవేశాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు.