Hans India and hmtv: హాన్స్ ఇండియా-hmtv ఆధ్వర్యంలో మార్చి 28న విద్యార్థులకు అవగాహనా సదస్సు..వివరాలివే
Hans India and hmtv: హాన్స్ ఇండియా-hmtv ఆధ్వర్యంలో మార్చి 28న 10th, ఇంటర్ విద్యార్థుల కోసం కెరీర్ అవగాహనా సదస్సులు జరగనున్నాయి. వాటి వివరాలివే..
Hans India and hmtv: హాన్స్ ఇండియా-hmtv ఆధ్వర్యంలో మార్చి 28న విద్యార్థులకు అవగాహనా సదస్సు..వివరాలివే
Hans India and hmtv: ఇది పోటీ ప్రపంచం. విద్యార్థులకు.. తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు ఎదో ఒక సందేహం వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు. ఇంటర్ పూరయ్యాకా ఏమి చదవాలి? ఈ ప్రశ్న తలెత్తని వారు ఉండరు. పైగా ఇంటర్ చదువుతున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులను తికమక పెట్టేలా ఎన్నో సలహాలు..సూచనలు అడక్కుండానే వచ్చేస్తూ ఉంటాయి. ఫలానా వాళ్ళు ఫలానా కోర్సు చేసి నెలకు లక్ష రూపాయల జీతం తెచ్చుకుంటున్నారు అనో.. ఆ కోర్సు చేసిన వాళ్ళు ఎందుకూ పనికిరాకుండా పోయారనో ఇలా ఎవరో ఒకరు ఏదో ఒక విషయాన్ని చెబుతూనే ఉంటారు. దీంతో చాలామంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో పడిపోతారు.
ఇంటర్ తర్వాత ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నా.. కోర్సు ఎంపిక చేసుకోవడంలో తికమక పడిపోతుంటారు. విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. అవన్నీ పదిలంగా గమ్యాన్ని చేర్చేవే. అయితే వాటిలో ఎవరికి ఏ దారి బాగో తెలుసుకోవాల్సింది మాత్రం విద్యార్థులే. ఎందుకంటే.. స్పష్టమైన లక్ష్యంతో ఎంచుకున్న కోర్సులే భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇంజినీరింగ్, మెడిసిన్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్,టెక్నీకల్ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి.
కోర్సును ఎంచుకునే ముందు విద్యార్థులు తమకు ఉన్న సామర్ధ్యాన్ని సరిగ్గా అంచానా వేసుకోగలగాలి. తమ సామర్ధ్యాన్ని, ఆసక్తిని విశ్లేషించుకోవాలి. అందుకు తల్లిదండ్రులు సహకరించాలి. అప్పుడే సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటూనే. సాధారణంగా ఎవరో ఎదో చెప్పారు.. ఎవరో ఎదో చదివి ఎలానో ఉన్నారు అని ఆ కోర్సులవైపు వెళ్లిపోతుంటారు. అది సరైన పధ్ధతి కాదు. తామెంచుకున్న కోర్సుపై ఆసక్తి.. దానిని మంచి స్థాయిలో పూర్తిచేయగలిగిన సామర్ధ్యం ఉందా? లేదా అన్నది విశ్లేషించుకున్నాకే ముందడుగు వేయాలి. విద్యార్థికి ప్రావీణ్యం, ఆసక్తి ఉన్న అంశాన్ని ఎంచుకుంటే భవిష్యత్తు చక్కగా ఉంటుంది.
బైపీసీ తర్వాత మెడిసిన్ ఒక మార్గం మాత్రమే. మెడిసిన్ సీటు రాకుంటే జీవితం ఆగిపోయినట్లేం కాదు. న్యూట్రిషన్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రిటెక్‌లాంటి రంగాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి.
ఎంపీసీ తర్వాత ఐఐటీలోనో, ఎన్‌ఐటీలోనో సీటు రాకపోతే కొంపలేం మునిగిపోవు. ఆర్కిటెక్చర్, డేటాసైన్స్, డిఫెన్స్ (ఎన్‌డీఏ), రోబోటిక్స్, ఏఐ వంటి మోడర్న్, ఫ్యూచరిస్టిక్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా అలాగే కామర్స్ కోర్టుల్లోకూడా ఎన్నో అవకాశాలున్నాయి..
ఈ విషయాలన్నిటి పైనా సమగ్ర అవగాహన కల్పించడానికి.. విద్యార్థులకు తమ కెరీర్ పై ఉన్న ప్రతి ఒక్క సందేహాన్నీ నివృత్తి చేయడానికి hmtv ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్, హన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్ వేడుకలో పలు రంగాల నిపుణులతో విద్యార్థులకున్న కెరీర్ సమస్యలపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయనున్నారు.
బాగ్ లింగంపల్లి, ఆర్టీసీ కళాభవన్ లో 28వ తేదీ శనివారం, ఉదయం 10 గంటలకు హాన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026 కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమంలో..
1. How to prepare for JEE MAINS and JEE ADVANCE.
2. What are the AI trends in Education, How to Acquire skills.
3. Innovations & Entrepreneurship, How to acquire leadership Traits.
4. Ethics and Social responsibility of the youth, how to come out from social media craze.
సదస్సులు నిర్వహిస్తారు.
బాగ్ లింగంపల్లి, ఆర్టీసీ కళాభవన్ లో 28వ తేదీ శనివారం, మధ్యాహ్నం 2 గంటల నుంచి hmtv ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్-2026 కార్యక్రమం ఉంటుంది. ఇందులో..
1. How to prepare for EAPCET?
2. How to prepare NEET?
3. How to choose the right college & branch based on interest ,rank and future scope ?
4. Non-Engineering career opportunities
వంటి అంశాలపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తారు.
ఆ తరువాత అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిధులుగా: కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డిగారు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు. మరో మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు అలాగే తెలంగాణ శాసన సభ్యులు బీర్ల అయిలయ్య, తెలంగాణ హైయర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్ట రెడ్డి గారు, సినీ నటులు సుమన్ గారు పాల్గొననున్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.