Madanapalle: మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్‌గా శ్రీరామ లక్ష్మీదీపిక ఖరారు!

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి జనసేన పార్టీకి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ లక్ష్మీదీపిక పేరు ఖరారైంది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు శ్రీరామ రామాంజనేయులు కోడలైన లక్ష్మీదీపిక వైస్ చైర్మన్‌గా ఎంపిక కావడంతో జనసేన శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

14వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆమెకు వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన, ప్రమాణ స్వీకారంతో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags: