Puthalapattu: పంటపల్లి పంచాయతీ ప్రజలు ఆశీర్వదించండి: జయలక్ష్మి!
Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పంటపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జయలక్ష్మి ప్రభుత్వ, సొంత నిధులతో గ్రామ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Puthalapattu: పంటపల్లి పంచాయతీ ప్రజలు ఆశీర్వదించండి: జయలక్ష్మి!
పూతలపట్టు: పూతలపట్టు మండలం పంటపల్లి పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో పాటు, తన సొంత నిధులను కూడా వెచ్చించి పంటపల్లి పంచాయతీ నందు త్రాగునీరు, పరిశుభ్రత, గ్రామాలందు మురుగునీటి కాలువలు,
విద్యుత్ దీపాలు తో పాటు ఇతర సౌకర్యాలను ప్రజలకు అందించి మంచి సర్పంచిగా అనిపించుకుని పంచాయతీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు చూసుకుంటామని ఆమె తెలిపారు. పంటపల్లి పంచాయతీని రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీ తీర్చిదిద్ది అవార్డు తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పంటపల్లి పంచాయతీ ప్రజలందరూ సహకరించి గెలిపించాలని ఆమె కోరారు.