Chittoor: కటారి అనురాధ మోహన్ దంపతులకు ఎమ్మెల్యే గురజాల నివాళులు!

చిత్తూరు: దివంగత మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల సేవలను స్మరించుకుంటూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘనంగా నివాళులర్పించారు.మంగళవారం స్వర్గీయ మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల వర్ధంతిని పురస్కరించుకొని, వారి స్మృతి వనం వద్ద ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా దివంగత మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల సేవలను పలువురు స్మరించుకున్నారు. చిత్తూరు నగర అభివృద్ధికి, ప్రజా సేవకు వారు అందించిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రజలతో మమేకమై పనిచేసిన వారి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని దివంగత నేతలకు ఘనంగా నివాళులర్పించారు.

Tags: