Chittoor: 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు!

చిత్తూరు: తమ కుమారుడు చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం కల్పించినందుకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, టీడీపీ నాయకులు షణ్ముగం కుటుంబ సమేతంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ను ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి తమ కుమారుడు చందుపై నమ్మకంతో 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించి, శాలువా కప్పి ఘనంగా అభినందించారు. తమ కుటుంబానికి ఇచ్చిన ప్రోత్సాహం, గుర్తింపుపట్ల షణ్ముగం హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సహకారంతో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, 52వ వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షణ్ముగం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags: