Simple Wave EV: సింగిల్  చార్జ్‌తో 243 కిమీ రేంజ్.. 70 లీటర్ల స్టోరేజ్, ఫాస్ట్ చార్జింగ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

Simple Wave EV: భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రముఖ సంస్థ అయిన సింపుల్ ఎనర్జీ తన తొలి ఫ్యామిలీ ఫోకస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వేవ్‎ను అధికారికంగా విడుదల చేసింది.

Update: 2026-09-03 03:54 GMT

Simple Wave EV

Simple Wave EV: భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రముఖ సంస్థ అయిన సింపుల్ ఎనర్జీ తన తొలి ఫ్యామిలీ ఫోకస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వేవ్‎ను అధికారికంగా విడుదల చేసింది. రూ.1.10 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభించే ఈ స్కూటర్, సింగిల్ చార్జ్‌పై ఏకంగా 243 కిలోమీటర్ల మైండ్ బ్లాకింగ్ రేంజ్‌ను అందిస్తుండటంతో వాహన ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.సింపుల్ వేవ్ స్కూటర్ మొత్తం 6 కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చింది. వీటిని వేవ్ ఎస్, వేవ్, వేవ్ ప్లస్ అనే మూడు ప్రధాన వేరియంట్లుగా విభజించారు. టాప్ మోడల్ అయిన వేవ్ ప్లస్‌లో 5 కిలోవాట్ అవర్ భారీ బ్యాటరీ ప్యాక్, 6.4 కిలోవాట్ మోటార్ అమర్చారు. ఇది గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే ఏకంగా 243 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ ధృవీకరించింది. తక్కువ బడ్జెట్ కోరుకునే వారి కోసం 3.7, 2.7, 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇవి వరుసగా 171, 132, 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రైడ్, ఈకో, ఈకో ఎక్స్, స్పోర్ట్ వంటి రకరకాల డ్రైవింగ్ మోడ్లను ఎంచుకునే సదుపాయం ఉంది.

ఫాస్ట్ చార్జింగ్, ల్యామినేటెడ్ డిజైన్

సరికొత్త సాంకేతికతతో రూపొందించిన ఈ స్కూటర్ బ్యాటరీ, మోటార్లకు ఐపీ67 వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఇచ్చారు. టాప్ వేరియంట్‌లో ఉన్న ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ ద్వారా కేవలం 2 గంటల 15 నిమిషాల్లోనే బ్యాటరీని 0 నుంచి 80 శాతానికి చార్జ్ చేసుకోవచ్చు. స్మూత్ కర్వ్‌లు, ఆకర్షణీయమైన రౌండ్ ఎడ్జ్‌లతో డిజైన్ చేసిన ఈ వాహనం రోడ్డుపై చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. పర్ల్ వైట్, కోరల్ రెడ్, ట్విలైట్ బ్లాక్, పోలార్ బ్లూ, డాల్ఫిన్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్ వంటి ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

ఏకంగా 70 లీటర్ల బూట్ స్పేస్

సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో సామాన్లు పెట్టుకునే స్థలం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయంలో సింపుల్ వేవ్ సరికొత్త రికార్డు సృష్టించింది. సీటు కింద 63 లీటర్లు, ముందరి భాగంలో 3 లీటర్ల గ్లోవ్‌బాక్స్, మరో 4 లీటర్ల పిల్ కాంపోనెంట్ కలిపి ఏకంగా 70 లీటర్ల విశాలమైన స్టోరేజ్ స్పేస్‌ను అందిస్తోంది. నిత్యం కుటుంబ అవసరాలకు, సరుకుల రవాణాకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

అడ్వాన్సుడ్ టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లు

వేరియంట్‌ను బట్టి 7 ఇంచుల టచ్ స్క్రీన్ లేదా 5 ఇంచుల డిజిటల్ స్క్రీన్ అందుబాటులో ఉంటుంది. నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, జిపిఎస్ ట్రాకింగ్, ఫోన్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, యుఎస్‌బి చార్జింగ్ వంటి ఆధునిక వసతులు ఉన్నాయి. రైడర్ సేఫ్టీ కోసం ట్రాక్షన్ కంట్రోల్, రెస్పాన్సివ్ బ్రేకింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, వాహనం ఎక్కడుందో తెలుసుకునే లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ ఇచ్చారు. 12 ఇంచుల అలాయ్ వీల్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తో రూపొందించిన ఈ స్కూటర్ ఇండియన్ రోడ్లపై ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తుంది.

Tags:    

Similar News