పాత కారు లేదా కొత్త కారు? మనం దేనికి జేబులో నుంచి డబ్బులు ఎక్కువ పెట్టాలి!
New Car vs Old Car: కొత్త కారు కొనాలా? లేదా పాత కారు కొనాలా? కారు కొనే ముందు మధ్యతరగతి వారిని ఎక్కువగా వేధించే ప్రశ్న ఇది.
పాత కారు లేదా కొత్త కారు? మనం దేనికి జేబులో నుంచి డబ్బులు ఎక్కువ పెట్టాలి!
New Car vs Old Car: సొంత కారు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక పెద్ద కల. అయితే కారు కొనాలనుకున్నప్పుడు ముందుగా ఎదురయ్యే ప్రశ్న.. కొత్త కారు కొనాలా? లేదా వాడిన కారు కొనాలా? అనేది. ఈ విషయంపై చాలామంది కేవలం స్టేటస్ కోసం ఆలోచించి ఆర్థికంగా నష్టపోతుంటారు. ఒక కారు కొనేముందు ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలో ఆర్థిక నిపుణులు పంచుకున్నారు.
కొత్త కారు వర్సెస్ పాత కారు:
డిప్రిసియేషన్: మీరు కొత్త కారు కొన్న మొదటి రెండు మూడేళ్లలోనే దాని విలువలో భారీగా డిప్రిసియేషన్ ఉంటుంది. షోరూమ్ నుంచి బయటకు రాగానే కారు విలువ సుమారు 20 శాతం నుండి 30 శాతం పడిపోతుంది. అదే పాత కారు విషయంలో ఈ డిప్రిసియేషన్ ముందే జరిగిపోయి ఉంటుంది కాబట్టి, రీసేల్ వాల్యూ పరంగా పాత కారుతో పెద్దగా నష్టం ఉండదు.
రుణ భారం: కొత్త కారుకు బ్యాంకులు సులభంగా, తక్కువ వడ్డీకే లోన్ ఇస్తాయి. కానీ, కారు ధర ఎక్కువగా ఉండటం వల్ల మీరు కట్టాల్సిన ఈఎంఐ భారం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే సెకండ్ హ్యాండ్ కారుకు వడ్డీ రేటు కాస్త ఎక్కువైనా, అసలు ధర తక్కువ కాబట్టి మొత్తం రుణ భారం తక్కువగానే ఉంటుంది.
నిర్వహణ ఖర్చులు: కొత్త కారు కొన్న మొదటి కొన్నేళ్ల పాటు కంపెనీ వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ ఉండటం వల్ల నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ. కానీ సెకండ్ హ్యాండ్ కారుకు అప్పటికే ఎక్కువ కిలోమీటర్లు తిరిగి ఉండటం వల్ల తరచుగా రిపేర్లు, నిర్వహణ ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువ.
ఏది ఎవరికి బెస్ట్?
కారును కేవలం స్టేటస్ కోసం కాకుండా ప్రయాణ అవసరాలకు, బడ్జెట్‌లో తీసుకోవాలనుకునే వారికి, తక్కువ దూరాలు ప్రయాణించే వారికి 'సెకండ్ హ్యాండ్ కారు' మంచి ఆప్షన్.
మీకు అధునాతన ఫీచర్లు, ఎలాంటి రిపేర్ల గొడవ లేకుండా మనశ్శాంతిగా ఎక్కువ కాలం(5 ఏళ్ల పైబడి) కారును వాడాలనుకునే ఉద్దేశం ఉంటే 'కొత్త కారు'కు వెళ్లడం మంచిది.