Driving Licence: వాహనదారులు ఎగిరిగంతేసే వార్త.. లైసెన్స్ వ్యాలిడిటీ ఇకపై..

Driving Licence: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఓ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీని ఇకపై..

Update: 2026-06-09 13:18 GMT

Driving Licence: వాహనదారులు ఎగిరిగంతేసే వార్త.. లైసెన్స్ వ్యాలిడిటీ ఇకపై..

Driving Licence: సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అనగానే చాలామందికి ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగడం, ఏజెంట్లను పట్టుకోవడం లాంటి ప్రయాస గుర్తొస్తుంది. అయితే, వాహనదారుల కష్టాలను తగ్గించి, వారికి భారీ ఊరటనిచ్చే దిశగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ గడువును పెంచడంతో పాటు, మరిన్ని ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ 20 సంవత్సరాలు లేదా వాహనదారుడికి 40 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉంది. కానీ, ఈ నిబంధనను సవరించి డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీని ఏకంగా 50 ఏళ్ల వయసు వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే, లైసెన్స్ తీసుకున్న తర్వాత 50 ఏళ్ల వయసు వచ్చే దాకా పదే పదే రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది.

లైసెన్స్ గడువు పెంపుతో పాటు, ప్రాంతీయ రవాణా కార్యాలయాల సేవలను మరింత డిజిటలైజ్ చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. లైసెన్స్ రెన్యువల్, అడ్రస్ మార్పు, డూప్లికేట్ లైసెన్స్ జారీ లాంటి దాదాపు అన్ని ముఖ్యమైన సేవలను ఆన్‌లైన్ ద్వారానే పూర్తి చేసేలా పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఆన్‌లైన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చడం ద్వారా మధ్యవర్తులు లేదా ఏజెంట్ల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించనున్నారు.

ఆధార్ ఈ- కేవైసీ ద్వారా ఇంటి నుంచే ధృవీకరణ పూర్తి చేసుకుని, ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. 

Tags:    

Similar News