Electric Car: దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ కారు ఇదే.. పైగా రూ.80 వేలు తగ్గింపు..!

Electric Car: మెట్రో నగరాల్లో ట్రాఫిక్, ఇంధన ధరల భారం నుండి ఉపశమనం కోసం చూస్తున్నారా?

Update: 2026-06-11 04:54 GMT

Electric Car: దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ కారు ఇదే.. పైగా రూ.80 వేలు తగ్గింపు..!

MG Comet EV : మారిన కాలంతో పాటు మెట్రో నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, పెరిగిపోతున్న ఇంధన ధరల భారం నానాటికీ ఎక్కువవుతోంది. ఇలాంటి తరుణంలో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఐటీ ఉద్యోగులు సిటీ ప్రయాణాల కోసం తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం వెతుకుతున్నారు. ఒకవేళ మీ ప్లాన్ కూడా ఇదే అయితే.. మీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ MG తన పాపులర్ మైక్రో ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EV పై జూన్ 2026 నెలకు సంబంధించి భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ జూన్ నెలలో కొత్తగా కారు కొనేవారికి ఏకంగా రూ. 80,000 వరకు టోటల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ ఈవీ మార్కెట్లో ఈ చిన్న కారు ఇప్పుడు మునుపెన్నడూ లేనంత చవకగా మారిపోయింది.

డిస్కౌంట్ల లెక్క ఎలా ఉందంటే..?

కంపెనీ దేశవ్యాప్తంగా వివిధ వేరియంట్లపై పలు రకాల ఆఫర్లను కలగలిపి ఈ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్లు, పాత కారు మార్చుకునే వారికి ఎక్స్ఛేంజ్ బోనస్, ఇప్పటికే MG కారు ఉన్నవారికి లాయల్టీ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు కలగలిపి ఉన్నాయి. భారతదేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్యాష్ డిస్కౌంట్ రూ. 30,000 వరకు లభిస్తోంది. దీనివల్ల అన్ని ఆఫర్లూ కలుపుకుంటే మొత్తం తగ్గింపు గరిష్టంగా రూ. 80,000 మార్కును తాకుతోంది.

ఎందుకు బెస్ట్ ఛాయిస్?

MG కామెట్ EV అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని కాంపాక్ట్ సైజ్. 3 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే ఈ మైక్రో-ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలు ఇవే.. దీని టర్నింగ్ రేడియస్ చాలా తక్కువ. రద్దీగా ఉండే రోడ్లు, ఇరుకైన గల్లీల్లో చాలా సులభంగా యూ-టర్న్‌లు తీసుకోవచ్చు. మెట్రో సిటీలలో పార్కింగ్ స్థలం దొరకడం ఒక పెద్ద యుద్ధం. కానీ కామెట్ EVని బైక్ పార్కింగ్ కంటే కొద్దిగా ఎక్కువ స్థలం ఉన్నా ఈజీగా పార్క్ చేసేయొచ్చు. ఇది చూడటానికి చిన్న కారులా ఉన్నా, ఇందులో అందించిన ఫీచర్లు మాత్రం ఫుల్ ప్రీమియం రేంజ్‌లో ఉంటాయి. ఇందులో 17.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 230 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. రోజువారీ ఆఫీస్, సిటీ ప్రయాణాలకు ఇది చాలా ఎక్కువ.

కారు లోపల డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్లు ,ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్, మరొకటి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఆకట్టుకుంటాయి. వాయిస్ కమాండ్‌లు, రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు అధునాతన 'కనెక్టెడ్ కార్ టెక్నాలజీ'ని ఇందులో పొందుపరిచారు. భారత మార్కెట్లో MG కామెట్ EV ప్రధానంగా టాటా టియాగో EVకి గట్టి పోటీని ఇస్తోంది. అయితే ఈ రెండింటికీ చిన్న తేడా ఉంది. టియాగో EV అనేది పక్కా ట్రెడిషనల్ ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ కారు. కానీ, కామెట్ EV అనేది కేవలం సిటీ లోపల తక్కువ దూరాలు, ఆఫీస్ కమ్యూట్ కోసం ఒక స్టైలిష్, కాంపాక్ట్ మోడల్‌ను కోరుకునే యువత , చిన్న కుటుంబాలకు మోస్ట్ లగ్జరీ అండ్ ఎకనామికల్ ఆప్షన్.

Tags:    

Similar News