Daily Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి
Daily Horoscope: మే 8, 2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు ,పంచాంగం.
Daily Horoscope
Today Phalalu : మే 8, 2026, శుక్రవారానికి సంబంధించిన రాశి ఫలాలు పంచాంగం వివరాలు మీ కోసం.
మేషం
ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభాలు, కొత్త ఆశలు చిగురిస్తాయి.
వృషభం
బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధన వ్యయం సూచన.
మిథునం
దూర ప్రయాణాలు చేస్తారు. విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరగవచ్చు.
కర్కాటకం
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు లేదా స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూలత.
సింహం
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. సన్నిహితుల మద్దతు లభిస్తుంది.
కన్య
ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. పనుల్లో జాప్యం జరుగుతుంది. దైవ దర్శనం ఉపశమనాన్ని ఇస్తుంది.
తుల
కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రావచ్చు. శ్రమ పెరిగినా ఆశించిన ఆదాయం ఉండకపోవచ్చు.
వృశ్చికం
పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ధనుస్సు
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలగవచ్చు. మిత్రులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి.
మకరం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచన ఉంది. హోదాలు పెరుగుతాయి.
కుంభం
రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.
మీనం
కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.
గమనిక: ఈ ఫలితాలు గ్రహగతుల ఆధారంగా చెప్పబడినవి, వ్యక్తిగత జాతకాలను బట్టి మార్పులు ఉండవచ్చు.