Daily Horoscope: రాశిఫలాలు - ఈరోజు ఈ రాశులవారికి భారీ లాభాలు- పరిహారాలు ఇవే
ఈరోజు ఏ రాశుల వారికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయో, ఎవరికి ధనలాభాన్ని తీసుకొస్తున్నాయో తెలుసుకుందాం.
Daily Horoscope: వైశాఖ మాసం, బహుళ పక్షం, పాఢ్యమి తిథి రాత్రి 12:49 వరకు. తదుపరి విదియ తిథి ప్రారంభం అవుతుంది. నక్షత్రం విశాఖ రోజంతా ఉంటుంది. వ్యతీపాత యోగం రాత్రి 09:45 వరకు, తదుపరి వరీయన యోగం వస్తుంది. ఇక వైశాఖ మాసాన్ని మాధవమాసం అంటాం. ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన ఈ కాలంలో గ్రహగతులు కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభాన్ని కలిగిస్తాయి. మరి ఈరోజు ఏ రాశుల వారికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయో, ఎవరికి ధనలాభాన్ని తీసుకొస్తున్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగస్తులు వీలైనంత వరకు శాంతంగా ఉండాలి. పై అధికారులతో విబేధాలు పెంచుకోకూడదు. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ది హనుమాన్‌ను ఆరాధించాలి.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చెప్పాలంటే ఈరాశివారికి అదృష్టయోగం పట్టింది అనొచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా వాయిదా పడుతున్న పనులు ఈరోజు పూర్తవుతాయి. ధనలాభం మెండుగా ఉంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు మహాలక్ష్మిని ధ్యానించడం వల్ల సంపద మరింత వృద్ధి చెందుతుంది.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. వ్యాపారస్తులు అనవసర పెట్టుబడుల జోలికి వెళ్లకండి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఈరోజు ఈరాశివారు ఇష్ట దైవాన్ని స్మరించడం వల్ల మనోబలం పెరుగుతుంది.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎవరినో నమ్మి మీ సొంత నిర్ణయాలను మార్చుకోవద్దు. ఆర్థికంగా బాగున్నప్పటికీ, ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం. ఈరోజు ఈరాశివారు నవగ్రహ దర్శనం వల్ల దోషాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. దైవబలం తోడుగా ఉన్న రోజు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతారు. అనుభవజ్ఞుల సలహాలు మీకు శ్రీరామరక్ష. ఆర్థికంగా ఏ లోటు ఉండదు. భయాందోళనలు తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠించడం శుభకరం.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు గజకేసరి యోగం వంటి ఫలితాలు లభిస్తాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈరోజు ఈరాశివారు మహాలక్ష్మి అష్టకం పారాయణ చేయడం శుభప్రదం.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు, రచయితలకు ఇది అద్భుతమైన సమయం. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఈరోజు ఈరాశివారు ఇష్ట దేవతారాధన చేయాలి.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే రోజు. వ్యాపారంలో అకస్మాత్తుగా ధనప్రాప్తి ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం పట్ల స్వల్ప జాగ్రత్తలు అవసరం. ఈరోజు ఈరాశివారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆదాయం బాగున్నా, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవడం వల్ల ఇబ్బందులు తప్పుతాయి. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ధర్మంవైపు నిలబడాల్సిన సమయం. విజయాలు సొంతం అవుతాయి. బద్దకాన్ని విడిచిపెట్టాలి. వ్యాపారంలో భారీ లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈరోజు ఈరాశివారు వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. బంగారు కాలమనే చెప్పాలి. అదృష్టం మీ తలుపు తడుతోంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇక ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మిత్రుల సహాయంతో క్లిష్టమైన సమస్యల నుండి గట్టెక్కుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఈరోజు ఈరాశివారు శివపంచాక్షరి జపం చేయడం శుభప్రదం.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు కేవలం సామాన్యమైనవే. వ్యక్తిగత జాతక ఫలితాలు కావు. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులను సంప్రదించాలి.