Daily Horoscope: రాశిఫలాలు- ఈ ఐదు రాశుల వారికి తిరుగులేని కాలం

వైశాఖ మాసం చతుర్ధశి రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో, ఎవరి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

Update: 2026-04-30 01:43 GMT

Daily Horoscope: ఈరోజు వైశాఖమాసం చతుర్ధశి తితి. రేపు అంటే మే 1న పౌర్ణమి వెలుగులకు ముందు ప్రత్యేకమైన శక్తి ప్రవహించే రోజుగా చెప్పవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నేటి గ్రహ సంచారం కొన్ని రాశులకు అద్భుతమైన యోగాలను కలిగిస్తోంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, వృశ్చికం, కుంభ రాశులవారికి ఈరోజు బంగారు కాలమని చెప్పవచ్చు. మరి ఈరోజు మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. శుభకరమైన రోజుగా చెప్పాలి. చేపట్టిన పనుల్లో వందశాతం విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈరాశివారు లక్ష్మీదేవిని ఆరాధించాలి.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. శ్రమతో కూడిన పనులు చేయవలసి వస్తుంది. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని పనులను వాయిదా వేయడం లేదా మొదలుపెట్టకపోవడం మంచిది. ఈరోజు ఈరాశివారు నవగ్రహ శ్లోకాలను పఠించడం మంచిది.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను నమ్మకపోవడమే మంచిది. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పఠించాలి.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలు ఈ రోజుతో తగ్గుముఖం పడతాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు కులదేవారాధన చేయాలి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీ వాక్చాతుర్యం ఈ రోజు మీకు శ్రీరామరక్ష. అధికారులతో కీలక చర్చలు సఫలమవుతాయి. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చుల మీద కన్ను వేసి ఉంచండి. మానసికంగా దృఢంగా ఉంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు శివలింగానికి అభిషేకం చేయడం వలన మెరుగైన ఫలితాలు పొందుతారు.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తిపరంగా ఈ రోజు మీరు ఒక గొప్ప శుభవార్త వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడం శుభప్రదం.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. పనుల్లో జాప్యం వల్ల కొంచెం ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురౌతాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. ఈరోజు ఈరాశివారు శని ధ్యానం చేయడం వల్ల ప్రతికూలతలు తొలగుతాయి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. విహార యాత్రలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా కాలం గడుపుతారు. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం శ్రేయస్కరం.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి ఈ రోజు చాలా అనుకూలం. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. ఈరోజు ఈరాశివారు ఇష్టదైవాన్ని ఆరాధించాలి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకోని లాభాలు ఆర్జిస్తారు. స్వల్ప శ్రమతోనే భారీ విజయాలు అందుకుంటారు. కుటుంబంలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు శివాష్టకం పఠించాలి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది కానీ ఇంట్లో చిన్నపాటి ఘర్షణలు రావచ్చు. ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. భాగస్వామ్య వ్యాపారులకు కలిసి వస్తుంది. ఈరోజు ఈరాశివారు ఓం నమశ్శివాయ మంత్ర జపం శ్రేయస్కరం.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశులు వాటి ఫలితాలు సామాన్యమైనవి. వ్యక్తిగతంగా పూర్తి జాకత ఫలితాలు కావాలనుకుంటే వ్యక్తిగత జ్యోతిష్యుడిని సంప్రదించాలి.  

Tags:    

Similar News