2026 మే నెల రాశిఫలితాలు... ఈ నాలుగు రాశుల జాతకులు అదృష్టవంతులు
మే నెలలో ఎండలు ఠారెత్తిస్తుంటాయి. మే నెలలో వైశాఖమాసం ముగిసి జ్యేష్టమాసం ప్రారంభమౌతుంది. ఈ మాసంలో ఎండలతో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా అధికంగా ఉంటుంది.
May 2026 Lucky Zodiac Signs : మే నెలలో ఎండలు ఠారెత్తిస్తుంటాయి. మే నెలలో వైశాఖమాసం ముగిసి జ్యేష్టమాసం ప్రారంభమౌతుంది. ఈ మాసంలో ఎండలతో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ నెలలోనే రవి గ్రహం వృషభరాశిలోకి ప్రవేశిస్తుంది. కుజుడు, బుధుడి స్థితిగతులు కూడా మారిపోతాయి. ఈ నేపథ్యంలో మే నెలలో 12 రాశుల జాతకం ఎలా ఉండబోతున్నది. అదృష్టవంతుల్ని చేసే రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి
మే నెలలో మేషరాశివారికి 70 శాతం సానుకూలత ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తి చేస్తారు. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. నూతన ఉద్యోగావకాశాలు వస్తాయి. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన ఆటంకాలు తొలగిపోతాయి.
వృషభ రాశి
ఈ నెలలో ఈరాశివారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అదృష్టాన్ని తీసుకొచ్చే కాలంగా నిలుస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమౌతాయి. ఆర్థికంగా బలమైన స్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు 40 శాతం వరకు లాభాలు ఇస్తాయి. ఉద్యోగులకు ఈ నెల ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. మే 15 తరువాత శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువుపై దృష్టిసారిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం అన్నివిధాలుగా సహకరిస్తుంది. ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం శుభప్రదం. శివపంచాక్షరి మంత్రం జపించడం మంచి ఫలితాలు పొందుతారు.
మిథునరాశి
ఈరాశివారికి మే నెలలో ఫలితాలు కొంత అనుకూలంగా ఉంటాయి. స్వల్ప ఆటంకాలు ఎదురుకావొచ్చు. ప్రారంభించిన పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. అసహనం పెరుగుతుంది. నిర్ణయాల్లో తొందరపడకూడదు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సామర్థ్యానికి పరీక్షాకాలమనే చెప్పాలి. నూతన ఒప్పందాలకు మంచి సమయం కాదు. ఆర్థికంగా నష్టాలే లేకపోయినా...ఖర్చులపై నియంత్రణ పాటించాలి. కుటుంబంలో చిన్నచిన్న అపార్థాలు రావొచ్చు. మాటల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా ఒత్తిడికి గురికావొచ్చు. అలసట పెరుగుతుంది. ఈ రాశివారు శనివారం రోజున శనీశ్వరుడిని ఆరాధించాలి. 11 సార్లు శనిగాయత్రి మంత్రం జపించాలి.
కర్కాటకరాశి
ఈ రాశివారికి మే నెల కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉంటారు. చిన్న చిన్న అపార్థాలు తొలగి, పరస్పర అవగాహన 50 శాతం వరకు మెరుగవుతుంది. ఉద్యోగపరంగా ఈనెల స్థిరత్వాన్ని అందిస్తుంది. పనిలో పెద్దగా మార్పులు లేకపోయినా... చేస్తున్న పనిలో గౌరవం పెరుగుతుంది. భవిష్యత్తుకు పునాదులు ఏర్పడతాయి. వ్యాపారల కృషి ఫలించే అవకాశాలు ఉన్నాయి. నష్టాలు లేకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉన్నప్పటికీ అలసటను నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రతి ఆదివారం సూర్యుడిని ఆరాధించాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సింహరాశి
ఈరాశివారికి మే నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రతిభ వెలుగులోకి వచ్చే మాసంగా చెప్పవచ్చు. తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తుకు భరోసాను ఇస్తాయి. మే 15 వ తేదీ తరువాత పనితీరు 70 శాతం వరకు మెరుగుపడుతుంది. కొత్త బాధ్యతలను అందిపుచ్చుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. అయితే, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వేడుకలు, సమావేశాలతో ఇంటి వాతావరణం ఉత్సాహంగా మారుతుంది. ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో ఆరోగ్యం బాగుంటుంది. విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయిస్తారు. ఇక ఈ రాశివారు మంగళవారం రోజు ఆంజనేయుడి ఆరాధన చేయడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
కన్యారాశి
ఈరాశివారికి మే నెల మధ్యస్థంగా ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురుకావొచ్చు. క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నూతన బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. నమ్మకంతో పనిచేస్తే ఫలితాలు రావొచ్చు. ఆర్థికంగా కొంత పర్వాలేదు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. సేవింగ్స్‌పై దృష్టిసారించాలి. వ్యాపారంలో నూతన అవకాశాలు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ప్రతి బుధవారం రోజున శ్రీమహావిష్ణువు నామస్మరణ, ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈరాశివారికి మే నెల అంతగా కలిసిరాకపోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. అదనపు భారం పెరుగుతుంది. సంబంధాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులకు పోరాదు. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో ఓర్పుగా ఉండాలి. మాటల్లో సౌమ్యత ఉండాలి. దాంపత్య జీవితంలో పరిస్పర అవగాహనను పెంచుకోవాలి. ఉగ్యోగంలోనూ పరిస్థితులు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. మార్పులు లేకపోయినా...సకాంలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఒత్తిడి ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. యోగా, ధ్యానం చేయాల్సి ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది. దుర్గా అష్టోత్తరం పఠించడం ద్వారా ప్రతికూలతలు తగ్గుతాయి.
వృశ్చికరాశి
ఈరాశివారికి మేనెల అత్యంత అనుకూలంగా ఉంది. ఊహించని మలుపులు ఈ నెలలో కనిపిస్తాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. భవిష్యత్తు కోసం నిధిని ఏర్పాటు చేసుకుంటారు. కెరీర్ పరంగా ఏకాగ్రత పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాలు పై అధికారులను మెప్పిస్తాయి. మే 10 తరువాత మీ పనితీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మే 1 పౌర్ణమి తరువాత సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. మే 15 వరకు చేపట్టిన పనుల్లో మూడొంతులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రతి సోమవారం శివుడిని ఆరాధించాలి. పాలు, నీటితో శివుడిని ఆరాధించడం శుభప్రదం.
ధనస్సురాశి
ఈరాశివారికి మే నెల కొంత అనుకూలంగా ఉంది. కొన్ని అవకాశాలు తలుపు తడతాయి. పనుల్లో కొంత వేగం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టత అవసరం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నూతన బాధ్యతలు పొందవచ్చు. కొత్త ఒప్పందాలు వ్యాపారులకు కలిసి రావొచ్చు. అయితే, లాభాల కంటే ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. సేవింగ్స్ రూపంలో దాచుకోవడం ఉత్తమం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరాశివారు ప్రతి గురువారం రోజున బృహస్పతిని ఆరాధించాలి. పసుపు పువ్వులతో గురువును ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు.
మకరరాశి
ఈరాశివారికి మే నెల అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. గతంలో చేపట్టిన పనులకు ప్రతిఫలం లభిస్తుంది. ఆలన్యంగా వచ్చినా ఫలితం స్థిరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉగ్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. పనితీరుతో పై అధికారులను మెప్పిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలమైన కాలం. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం కుదుటుగా ఉంటుంది. ఈరాశివారు ప్రతి శనివారం శనిదేవుని ఆరాధన చేయాలి. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
కుంభ రాశి
ఈరాశివారిని మే నెల కొంత అనుకూలంగా ఉంటుంది. సామాజికంగా గౌరవం పొందుతారు. మాటకు విలువ పెరుగుతుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. వ్యాపారంలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు రావొచ్చు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. కోపతాపాలను పక్కన పెట్టాలి. ఇక ఈరాశివారు ప్రతి శనివారం శనిదేవుడిని ఆరాధించాలి.
మీన రాశి
ఈరాశివారికి మే నెల కొంత అనుకూలంగా ఉన్నది. మొదటి అర్థభాగంలో ఆటంకాలు ఎదురౌతాయి. అయితే, తెలివిగా వాటిని ఎదుర్కొని పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తారు. పనులు ఆలస్యమైనా చివరకు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత మేలుగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు రావొచ్చు. వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ప్రతి గురువారం శ్రీమహావిష్ణువును ఆరాధించాలి.
గమనికః ఇక్కడ ఇచ్చిన మే నెల రాశిఫలితాలు సామాన్యమైనవే. వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కాదు. వ్యక్తిగత జాతక ఫలాల కోసం నిపుణులను సంప్రదించాలి.