Zodiac Signs: ఈరాశుల వారికి అక్షయ ఫలితాలు...ఏ పనిచేసినా వందశాతం విజయం

శుక్ల, బ్రహ్మయోగం కారణంగా ఈరోజు కొన్ని రాశుల జీవితాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆ రాశులేంటే తెలుసుకుందాం.

Update: 2026-06-04 02:19 GMT

Zodiac Signs: శ్రీపరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మరుతువు అధికజ్యేష్టమాసం బహుళపక్ష చవితి ఉత్తరాషాడ నక్షత్రం, శుక్రయోగంతో పాటు బ్రహ్మయోగం కూడా కలిసి రావడం వలన కొన్ని రాశులకు అక్షయం లాంటి ఫలితాలు ఉంటాయి. వీరు ఏ పని మొదలుపెట్టినా వందశాతం విజయం లభిస్తుంది. మరి అక్షయం లాంటి ఫలితాలు ఉన్న రాశులేంటో తెలుసుకుందామా

మేషరాశి

గందరగోళ పరిస్థితుల మధ్య రోజు ప్రారంభం అవుతుంది. అయితే, మధ్యాహ్నం తరువాత పరిస్థితులు కొంత మెరుగవుతాయి. ఈరోజు ఆర్థికంగా కొంత ఊరటనిస్తుంది. కానీ, ఆరోగ్యం పట్ల వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. పసుపు రంగు దుస్తులు ధరించాలి. శ్రీవేంకటేశ్వరుని దర్శనం శుభప్రదం.

వృషభరాశి

కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గులాబీ రంగు దుస్తులు ధరించాలి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం.

మిథునరాశి

చేపట్టిన పనులు ముందుకు తీసుకెళ్లేందుకు ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆకుపచ్చ దుస్తులు దరించాలి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

కర్కాటకరాశి

భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. ఇక విద్యార్ధులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సాంకేతికరంగానికి సంబంధించిన విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. నీలం రంగు దుస్తులు ధరించాలి. గణపతి ఆరాధన శుభప్రదం.

సింహరాశి

చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న రుణ ఒత్తిడిల నుంచి బయటపడతారు. వ్యాపారం కోసం నిధులను కూడబెట్టే ప్రయత్నం చేస్తారు. వాహనయోగం ఉంది. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. తెలుపురంగు దుస్తులు ధరించాలి. సరస్వతీదేవి ఆరాధన శుభప్రదం.

కన్యారాశి

మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన పనులు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలకమైన పనులను పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. వెండిరంగు దుస్తులు ధరించడం మంచిది. శివారాధన చేయడం ఉత్తమం.

తులారాశి

ఈరోజు అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. అనసవరపు విషయాల్లో జోక్యం చేసుకోరాదు. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వాహనయోగం ఉంది. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. పార్వతీదేవి ఆరాధన శుభప్రదం.

వృశ్చికరాశి

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన ఫలితాలను పొందుతారు. ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చేదిశగా అడుగులు వేస్తారు. కాషాయం రంగు దుస్తులు ధరించాలి. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.

ధనూరాశి

చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. నిర్ణయాలు తీసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఊదారంగు దుస్తులు ధరించాలి. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం.

మకరరాశి

ఆర్థికంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలుంటాయి. బంగారు రంగు దుస్తులు ధరించాలి. శ్రీమహాలక్ష్మి ఆరాధన శుభప్రదం.

కుంభరాశి

నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి దోహదపడతాయి. శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. నారింజ రంగు దుస్తులు ధరించాలి. కులదైవం ఆరాధన శుభప్రదం.

మీనరాశి

ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న సమస్యలు పరిష్కారమౌతాయి. మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్ధతు పొందుతారు. సర్వత్రా విజయావకాశాలు కలుగుతాయి. మెరూన్‌ రంగు దుస్తులు ధరించాలి. సాయిబాబా ఆరాధన శుభప్రదం.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు సామాన్యమైనవి. వ్యక్తిగత రాశిఫలితాలు కావాలనుకునేవారు నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించాలి.  

Tags:    

Similar News