Daily Horoscope: శివ యోగంతో ఈ రాశులకు అన్నీ శుభాలే

పరిఘ యోగం, శివయోగం కారణంగా పలు రాశుల్లో ఎవరూ ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2026-05-29 02:15 GMT

Daily Horoscope: శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్టమాసం శుక్లపక్ష త్రయోదశి తిథి శుక్రవరాం కావడంతో జ్యోతిష్యశాస్త్ర పరంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఉదయం 9.50 గంటల వరకు త్రయోదశి అనంతరం చతుర్ధశి తిథి ప్రారంభం అవుతుంది. స్వాతితో పాటు విశాఖ నక్షత్ర ప్రభావం కూడా ఈరోజు ఉన్నది. పరిఘ యోగం, శివయోగం కారణంగా పలు రాశుల్లో అనేకల మార్పులు సంభవించబోతున్నాయి. పట్టుదలతో పనిచేసేవారికి, క్రమశిక్షణతో ఉండేవారికి, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. నక్షత్ర ప్రభావం, యోగాల కలియిక ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి

మేషరాశివారికి ఈరోజు శుభఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు గణపతిని ఆరాధించడం శ్రేయస్కరం.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఒత్తిడి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు శివాలయంలో అభిషేకం చేయడం మంచిది.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. మాటతీరును మార్చుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. పెద్దల సలహాలు తీసుకోవాలి. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయడం ఉత్తమం.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉండే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయాలి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బాల్యస్నేహితులను కలుసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు ఈరాశివారు దుర్గాదేవిని ఆరాధించాలి.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. తగిన గుర్తింపు కోసం చాలా కష్టపడవలసి వస్తుంది. కొన్ని విషయాల్లో నిరాశ ఎదురౌతుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మాట కంటే మౌనంగా ఉండటం మేలు. ఈరోజు ఈరాశివారు హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించాలి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. మంచి పనులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఆలయాలను సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఉద్యోగంలో మార్పును కోరుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలను తప్పకుండా అనుసరించాలి. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభకరం.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీ ప్రణాళికలను, ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారంలో అనుకోని ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. ఈరోజు ఈరాశివారు దక్షిణామూర్తిని ఆరాధించడం శుభకరం.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. నమ్మినవారే మోసం చేసే అవకాశం ఉంది. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలి.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయాలి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. పనుల్లో అనుకున్న విధంగా విజయం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ది హనుమాన్‌ను ఆరాధించాలి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో సహోద్యోగుల మద్ధతు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోపాన్ని వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు ఈరాశివారు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మేలు చేస్తుంది.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు సామాన్యమైనవే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కావు.  

Tags:    

Similar News