June 2026 Horoscope: జూన్ రాశిఫలితాలు...రాజయోగంతో ఈ నలుగురి జాతకం మారబోతుంది
ఈ జూన్ నెలలో ద్వాదశ రాశుల్లో వచ్చే ప్రధానమైన మార్పులు, లాభాలు, నష్టాలు, పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం.
June 2026 Horoscope: అధిక, నిజ జ్యేష్టమాసం కలయిక జూన్ నెలలో కనిపించబోతున్నది. ఈ రెండు మాసాల కలయిక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనున్నది. ఈ కారణంగా గ్రహాల సంచారం ముఖ్యంగా బుధ, శుక్ర, కుజ గ్రహాల వలన నాలుగు ప్రధానమైన రాజయోగాలు కలగబోతున్నాయి. ఈ కారణంగా నాలుగు రాశులకు విశేషమైన లాభాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే, మిగతారాశుల వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అధిక, నిజ జ్యేష్టమాసంలో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని పండితులు చెబుతున్నారు. మరి ఈ జూన్ నెలలో ద్వాదశ రాశుల్లో వచ్చే ప్రధానమైన మార్పులు, లాభాలు, నష్టాలు, పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశివారికి జూన్‌నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు మొదలుపెడతారు. ఉద్యోగ పరంగా సరికొత్త అవకాశాలు వస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఆదాయంపెరిగినా దానికి తగినట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. జూన్ 13 తరువాత బుధాదిత్య యోగం కలుగుతుంది. దీని కారణంగా సృజనాత్మకత పెరుగుతుంది. ఈరాశివారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి.
వృషభరాశి
వృషభరాశివారికి ఈ జూన్ నెల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలని అనుకునేవారి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సువర్ణావకాశం అనే చెప్పాలి. జూన్ 29నాటికి శశమహాపురుష యోగం ప్రభావంతో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరాశివారు శుక్రవారం నాడు లక్ష్మీదేవి అష్టోత్తరం పఠించడం వల్ల సంపద స్థిరంగా ఉంటుంది.
మిథునరాశి
మిథునరాశివారికి ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. కమ్యునికేషన్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటారు. ఆగిపోయిన పనులు ముందుకు తీసుకెళ్తారు. ఆస్తి వివాదాలకు ముగింపు లభిస్తుంది. ఈ రాశివారు బుధవారం నాడు గణపతికి గరిక సమర్పించడం మేలు చేస్తుంది.
కర్కాటకరాశి
కర్కాటకరాశివారికి ఈ నెల అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలోనూ వృద్ధి సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో భారీ లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ఈ రాశివారు సోమవారం శివాభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సింహరాశి
సింహరాశివారికి ఈ నెల పట్టిందల్లా బంగారమే అవుతుంది. నాయకత్వ లక్షణాలతో ఆకట్టుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. బాల్య స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. జూన్ 19 తరువాత కీర్తి మరింత పెరుగుతుంది. ఈరాశివారు ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పఠించాలి.
కన్యారాశి
కన్యారాశివారికి ఈ నెల ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా జీవితం వృద్దిలోకి వచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. పనుల్లో వేగం పెరుగుతుంది. జూన్ 28 తరువాత విజయం మీ సొంతం అవుతుంది. ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి.
తులారాశి
తులారాశివారికి ఈ నెల ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని రకాలైన సమస్యలకు విముక్తి లభిస్తుంది. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. వృత్తిపరమైన జీవితంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారికి శనిదేవుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం శ్రేయస్కరం.
వృశ్చికరాశి
వృశ్చికరాశివారికి జూన్ నెల ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. రాహువు సంచారం అనుకూలంగా లేకపోవడంతో కొన్ని అనారోగ్యమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైద్యఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరాశివారు దుర్గాదేవిని ఆరాధించడం వలన రక్షణ పొందుతారు.
ధనస్సురాశి
ధనస్సురాశివారికి జూన్ నెల అదృష్టకరమైన మాసంగా చెప్పవచ్చు. ముఖ్యంగా జూన్ 13 తరువాత అదృష్టం వరిస్తుంది. వ్యాపారంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా స్థిరపడతారు. ఇక ఈరాశివారు గురువారం నాడు దత్తాత్రేయ స్వామి లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం శుభకరం.
మకరరాశి
మకరరాశివారికి ఈనెల ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మేలు. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరాశివారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
కుంభరాశి
మకరరాశివారికి జూన్ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. బంధువులు, స్నేహితుల నుంచి తగినంత సహకారం లభిస్తుంది. ఇక ఈరాశివారు శనివారం నాడు పేదలకు అన్నదానం లేదా సహాయం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
మీనరాశి
మీనరాశివారికి జూన్ నెల ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. ఈ మాసం ఎక్కువ భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మాట్లాడే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. లౌక్యం ప్రదర్శించడం ఒక్కటే మేలైన మార్గం. ఇక ఈరాశివారు ప్రతిరోజూ ఉదయం గాయత్రీ మంత్రం జపించడం వల్ల బుద్ధి స్థిరత లభిస్తుంది.
గమనికః ఇక్కడ ఇచ్చిన మాస ఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. ఎవరి జాతకాన్ని ఉద్దేశించి ఇచ్చినవి కావు.