Daily Horoscope: ఈ రాశులకు చేతినిండా పని ఉన్నా...చేతిలో చిల్లిగవ్వ నిల్వదు

పాడ్యమి తిథి, జ్యేష్ట నక్షత్రం, సిద్ధి, సాధ్య యోగాల ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

Update: 2026-06-01 02:04 GMT

Daily Horoscope: శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ట మాస బహుళ పక్ష పాఢ్యమి తిథి ఈ సోమవారం పలు రాశుల్లో కీలక పరిణామాలు చోబటు చేసుకోబోతున్నాయి. అంతేకాకుండా, ఈరోజు జ్యేష్ట నక్షత్రం, సిద్ధి, సాధ్య యోగాల ప్రభావం కూడా రాశులపై ఉండనున్నది. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఎవరికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు మహాశివుడికి అభిషేకం చేయడం ఉత్తమం.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తున్నది. ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయడం శ్రేయస్కరం.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని వార్తలు మీ చెవిన పడతాయి. ఓర్పుతో వ్యవహరిస్తే కొన్ని వివాదాలు తొలగిపోతాయి. ఈరోజు ఈరాశివారు దక్షిణామూర్తిని ఆరాధించాలి.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. సహనంతో వ్యవహరించాలి. వివాదాలకు ముఖ్యంగా రాజకీయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. మాట తీరును మార్చుకోవాలి. ఈరోజు ఈరాశివారు గణపతిని ఆరాధించాలి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమౌతాయి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. సమస్యలు పరిష్కారమౌతాయి. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ధి హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించాలి.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. పట్టుదలతో ముందుకు సాగాల్సిన సమయం. ఆటంకాలు ఎదురౌనా ఫలితం లభిస్తుంది. ఖర్చులను వీలైనంత వరకు నియంత్రించుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు సూర్యభగవానుడిని ఆరాధించాలి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు పార్వతీదేవిని ఆరాధించాలి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకూడదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇచ్చిన మాటపై నిలబడే విధంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించాలి.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంలో నూతన వ్యాపారాలు మొదలుపెడతారు. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మిని ఆరాధించాలి.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. శ్రమిస్తేనే విజయం లభిస్తుంది. శ్రమతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఈరోజు ఈరాశివారు సిద్ధి గణపతిని ఆరాధించాలి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. ఏ విషయంలోనూ సహనం కోల్పోకూడదు. ఒత్తిడి పెరిగినా కృషితోనే విజయం సాధిస్తారు. ఆదాయం కొంత బాగుంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. ఒత్తిడి పెరుగుతుంది. కటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈరాశివారు సూర్యాష్టకాన్ని పఠించాలి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కావు.   

Tags:    

Similar News