Eluru: కుక్కునూరులో కూటమి జోరు.. ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరులో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. భారీ ర్యాలీతో తరలివచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలు.
Eluru: కుక్కునూరులో కూటమి జోరు.. ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
ఏలూరు జిల్లా: కుక్కునూరు మండలంలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక ఉత్సవంలా నిర్వహించారు. వందలసంఖ్యలో టిడిపి, కూటమి నాయకులు, కార్యకర్తలు కుక్కునూరు నుండి జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అనే నినాదాలతో భారీ ర్యాలీ బయదేరి బెస్తగూడెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కుక్కునూరు మండల టిడిపి అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు మధుర వెంకటరమణల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహా ఆవిష్కరణ చేశారు.
సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు కోటగిరి సత్యనారాయణ మాట్లాడుతూ.. టిడిపి ఆవిర్భావంనుంచి నందమూరి తారక రామారావు వెంట ఉన్నానని,ఆ తర్వాత చంద్రన్న వెంట ఉంటున్నమని, 44ఏళ్లుగా ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణ వల్లే టిడిపిలో ఉన్నామని, ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడుస్తూ, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, చంద్రబాబు నేర్పిన ఓపిక, లోకేష్ బాబు నేర్పిన ధైర్యం, ఉత్సాహంతోనే పార్టీలో ముందుకు నడుస్తున్నామని తెలిపారు. అనంతరం టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు ఇంటి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కుక్కునూరు ఉపసర్పంచ్ పిచ్చుక రాజు, యూత్ నాయకులు నరేశ్ కుమార్ చూసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి మాచర్ల గంగరాజు, మాజీ వైస్ ఎంపిపి బొల్లు కృష్ణార్జునరావు, మాజీ సర్పంచ్ మడకం సుజాత, బిజెపి ధార్మిక శాఖ జిల్లా కో కన్వీనర్ వాడపల్లి లక్షణాచార్యులు, మణికంఠ, దాచారం సర్పంచ్ రామకృష్ణ, జనసేన మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్, నరుకుళ్ల సత్యనారాయణ, మడకం నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు సరిహద్దు సత్యనారాయణ, శీలం లక్ష్మయ్య, కరేటి అప్పారావు, పులి శ్రీనివాసరావు, చుంచు సత్యనారాయణ, కుచ్చర్లపాటి రమణరాజు, నరేంద్ర రాజు, ఓలేటి వెంకటేశ్వరరావు, వాసు, రాంబాబు బాపిరాజు, మాచర్ల రమణయ్య, ధూల్ పేట శ్రీను, మేడి పల్లి వీరబాబు, శేఖర్, రాంబాబు, బాలాజీ, నాయకురాలు వెంకటరమణ, రమాదేవి, లక్ష్మి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.