Nellore: నెల్లూరు తీరంలో భద్రతా గేర్.. రంగంలోకి దిగుతున్న హైస్పీడ్ బోట్లు!
Nellore: నెల్లూరు జిల్లాలో తీర భద్రత కట్టుదిట్టం. తమిళ జాలర్ల అక్రమ చొరబాటును అడ్డుకునేందుకు హైస్పీడ్ బోట్లు తీసుకువస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడి.
Nellore: నెల్లూరు తీరంలో భద్రతా గేర్.. రంగంలోకి దిగుతున్న హైస్పీడ్ బోట్లు!
Nellore: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, కృష్ణపట్నం పోర్ట్ వద్ద పెట్రోలింగ్ బృందాలకు మెడికల్ కిట్లు, తాడులు (రోప్స్), ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పంపిణీ చేసారు : కలెక్టర్ హిమాన్షు శుక్లా.
తేది. 28.03.2026 (శనివారం) ఇచ్చిన ఆదేశాల మేరకు, 29-03-2026 (ఆదివారం)న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, కృష్ణపట్నం పోర్ట్ వద్ద పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న బృందాలకు మెడికల్ కిట్లు, తాడులు (రోప్స్), ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అందజేశారు.పెట్రోలింగ్ బృందాలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అవసరమైన సామగ్రి అందజేసినట్లు తెలిపారు కలెక్టర్ సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారును ఆదేశించారు కలెక్టర్ హిమాన్షు శుక్లా.. తను చెప్పిన మాట ప్రకారం, మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తమిళనాడు పుదుచ్చేరి ప్రాంత మత్స్యకారుల అక్రమ సముద్ర జలాల చొరబాటుని అడ్డుకుంటామని తెలిపారు.
త్వరలోనే హై స్పీడ్ బోట్ ను తెస్తున్నట్లు చెప్పారు.. ఇప్పటికే తాను సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలియజేశారు. తమిళ జాలర్ల అక్రమ చొరబాటుని అడ్డుకునే తీరుతామని ఆయన చెప్పారు. మత్స్యకారులకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్న తక్షణమే తన సంప్రదించాలని పేరుతో మచ్చిక సంఘాలకు సూచనలు పంపారు.