Kalyanadurgam: కళ్యాణదుర్గంలో ప్రత్యేక ఆధార్ కేంద్రం ప్రారంభం!
Kalyanadurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సరోజా కాంపౌండ్ పోస్టాఫీస్‌లో ప్రత్యేక ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
Kalyanadurgam: కళ్యాణదుర్గంలో ప్రత్యేక ఆధార్ కేంద్రం ప్రారంభం!
Kalyanadurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యలతో నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారికి కళ్యాణదుర్గంలో శుభవార్త. పట్టణంలోని సరోజా కాంపౌండ్‌లో ఉన్న పోస్టాఫీస్ కార్యాలయంలో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సబ్ పోస్టుమాస్టర్ పద్మావతి తెలిపారు.
కొత్త ఆధార్ నమోదు, పేరు మార్పు, చిరునామా సవరణ, జనన తేదీ, మొబైల్ నంబర్ అప్డేట్, బయోమెట్రిక్ నవీకరణతో పాటు ఆధార్‌కు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట త్వరితగతిన అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఆధార్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవసరమైన ధ్రువపత్రాలతో కేంద్రాన్ని సందర్శిస్తే సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా ప్రవేశాలు, బ్యాంకింగ్ సేవలకు ఆధార్ కీలకమైన నేపథ్యంలో ఆలస్యం చేయకుండా సేవలు పొందాలని సూచించారు.