Anantapur: ఏసీబీకి చిక్కిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్

Anantapur: అనంతపురం జిల్లాలో రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన దేవాదాయ శాఖ ఏసీ మల్లికార్జున ప్రసాద్. ఈ నెల 31న రిటైర్ కానున్న వైనం.

Update: 2026-07-24 15:32 GMT

Anantapur: ఏసీబీకి చిక్కిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్

అనంతపూర్: అనంతపురం జిల్లా దేవాదాయ శాఖలో ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడులు కలకలం రేపాయి. రూ. 25 వేలు లంచం తీసుకుంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.పుట్లూరు మండలం రామలింగేపల్లిలో ఆలయ నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 'శ్రీవాణి ట్రస్ట్' ద్వారా రూ. 10 లక్షల నిధులను మంజూరు చేసింది.

ఇందులో రూ. 2 లక్షల విడత నిధుల విడుదలకు గాను, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ రూ. 25 వేల లంచం డిమాండ్ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి నుంచి ఈ రూ. 25 వేల లంచం తీసుకుంటుండగా, ముందస్తు సమాచారంతో వ్యూహాత్మకంగా దాడులు చేసిన ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి సీఐ అమీద్ ఖాన్ ఆధ్వర్యంలో ఆయనను పట్టుకున్నారు.

మరో ఆసక్తికర విషయమేమిటంటే... దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఈ నెల 31న సర్వీస్ నుండి రిటైర్ కాబోతున్నారు. ఉద్యోగ విరమణకు కొద్దిరోజుల ముందే ఇలా లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News