Kadiri: కదిరిలో నీట్ లీక్ నిరసన విద్యార్థి సంఘాల అరెస్ట్

Kadiri: నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బంద్. అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు.

Update: 2026-07-24 10:52 GMT

Kadiri: కదిరిలో నీట్ లీక్ నిరసన విద్యార్థి సంఘాల అరెస్ట్

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నేడు బంద్ నిర్వహించారు విద్యార్థి సంఘాల నాయకులు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిన నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఎఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో కదిరిలో పెద్ద ఎత్తున బంద్ నిర్వహించడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్టేషన్ తరలించారు.

ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ లక్షలాది మంది నీట్ విద్యార్థుల జీవితాలు నాశనం అవడానికి కారణమైన వారిని ఖటినంగా శిక్షించాలని, వాటికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిల్లీలో 26 రోజులుగా విద్యార్థులు నిరసనలు చేస్తుంటే వాటిని అణిచివేసేందుకు బిజెపి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. చిత్తశుద్ధి ఉంటే నీట్ పేపర్ లీక్ తో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసి సంబంధిత మంత్రిని రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News