Ananthapur: పంటల బీమా నమోదు గడువు మరో 2 నెలలు పొడిగించాలని డిమాండ్!

Ananthapur: అనంతపురం జిల్లా రాయదుర్గంలో పంటల బీమా నమోదు ఇబ్బందులపై రైతు సంఘం నేత తిప్పేస్వామి మండిపడ్డారు.

Update: 2026-07-25 16:30 GMT

Ananthapur: పంటల బీమా నమోదు గడువు మరో 2 నెలలు పొడిగించాలని డిమాండ్!

అనంతపూర్: కూటమి ప్రభుత్వం "పంటను రక్షించుకుందాం, చిన్న ప్రీమియంతో పెద్ద భరోసా" అంటూ ప్రకటనలు చేస్తున్నా, రాయదుర్గం మండలంలో రైతులు మాత్రం సి.ఎస్.సి కేంద్రాల చుట్టూ 4-5 రోజులు తిరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాలూకా కార్యదర్శి తిప్పేస్వామి, ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కావలి కోట్రేష్ ఆరోపించారు.

రాయదుర్గం మండలంలో మొత్తం 24 CSC కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 6 కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో రైతులు పట్టణాలకు తరలివెళ్లి సర్వర్ సమస్య, 1B సమస్యలతో బీమా నమోదు చేసుకోలేకపోతున్నారు.

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు:

1. సర్వర్ + 1B సమస్య: మీసేవ కేంద్రాల్లో సర్వర్ పనిచేయక, 1B పత్రం లేకపోవడంతో 4-5 రోజులు తిరిగినా నమోదు కావడం లేదు

2. సి.ఎస్.సి సెంటర్ల కేంద్రాల కొరత: 24లో 6 మాత్రమే పనిచేస్తున్నాయి. కొన్ని సెంటర్లలో రైతుల దగ్గర అదనపు వసూళ్లు చేస్తున్నారు

3. సమాచారం లేకపోవడం: చాలా CSC సెంటర్లలో పంటల బీమా నమోదు వివరాల బోర్డులు పెట్టలేదు

4. ప్రీమియం భారం: గత ప్రభుత్వంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది. ఇప్పుడు రైతుల నుండే వసూలు చేస్తున్నారు

5.ఎకరా బదులు హెక్టారుకు ధర నిర్ణయించడం వల్ల రైతులకు అదనపు భారం తగ్గుతుంది.

5.ఎల్నినో దెబ్బకు వర్షాలు లేక పంటలు పెట్టుకున్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

6.ఇప్పటికే ఫర్టిలైజర్ ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. రైతుకు మేలు చేసే ప్రభుత్వమని చెప్పే నాయకులేమో వీటిపై ప్రశ్నించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం బాధాకరం విచారకరం.

నాయకులు మాట్లాడుతూ "వర్షాలు లేక బోర్లు ఎండిపోయి, ఎరువుల ధరలు పెరిగి రైతు ఇప్పటికే నష్టపోతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సింది పోయి

సి.ఎస్.సి సెంటర్ల చుట్టూ తిప్పుతోంది. గ్రామంలోనే 10-15 మంది స్టాఫ్ తో సచివాలయాలు, ఆర్.బి.కె లు నడుస్తున్నప్పుడు, పంటల బీమా సేవలు అక్కడ ఎందుకు అందుబాటులో ఉంచడం లేదు?" అని ప్రశ్నించారు.

ప్రభుత్వాన్నికి డిమాండ్లు:

1. గ్రామ సచివాలయాలు, RBK కేంద్రాలకు పంటల బీమా నమోదు అనుమతులు వెంటనే ఇవ్వాలి

2. ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి - గత ప్రభుత్వ విధానం కొనసాగించాలి

3. హెక్టారు ప్రీమియం విధానం తీసుకురావాలి. ఎకరాకు రద్దు చేయాలి,

4. 24 CSC కేంద్రాలో అదనపు వసూళ్లను అరికట్టాలి

5. సర్వర్ సమస్యను తక్షణం పరిష్కరించాలి

6."కూటమి ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ఆగస్టు 17న జరిగే కలెక్టరేట్ ముట్టడిలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం" అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుమార్ కృష్ణ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News