Kadiri: కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి 25 విశ్రాంతి బెంచీలు విరాళం
Kadiri: కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి లక్ష రూపాయల విలువ చేసే 25 సిమెంట్ బెంచీలను విరాళంగా అందించిన సిమ్స్ ఆసుపత్రి ఎండీ నిసార్ యాసిన్.
Kadiri: కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి 25 విశ్రాంతి బెంచీలు విరాళం
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు వారికి తోడుగా వచ్చే కుటుంబ సభ్యులకు విశ్రాంతి కోసం లక్ష రూపాయలు విలువ చేసే సిమెంట్ బెంచీలను స్థానిక సిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రి యండీ నిసార్ యాసిన్ వితరణ చేశారు.
ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ హుస్సేన్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిసార్ యాసిన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యం కోసం విశ్రాంతి బెంచీలు అందించడం సంతోషంగా ఉందన్నారు.
పేదల కోసం ఆసుపత్రిలో ఇంకా ఎదైనా అవసరమైతే తనకు తెలపాలని ఆసుపత్రి సూపరెండెంట్ హుస్సేన్ కు తెలిపారు. తనకు సహకరించిన ఆసుపత్రి సూపరెండెంట్ హుస్సేన్ గారికి, సిబ్బందికి వైద్య బృందానికి సిమ్స్ యండీ నిసార్ యాసిన్ కృతజ్ఞతలు తెలిపారు.