O.D. Cheruvu: ఓ.డి. చెరువు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎమ్మెల్యే

O.D. Cheruvu: ఓ.డి. చెరువులో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి అనూహ్య స్పందన. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి.

Update: 2026-07-17 11:02 GMT

O.D. Cheruvu: ఓ.డి. చెరువు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎమ్మెల్యే

ఓడి చెరువు: ప్రజల పరిష్కారం కోసమే ప్రజా గ్రీవెన్స్ ఏర్పాటు చేసినట్లు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ఓ.డి చెరువు మండల కేంద్రంలోనీ ఐటీఐ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చేందుకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి అర్జీదారులు భారీగా తరలివచ్చారు.

తాగునీరు, రహదారులు, రెవిన్యూ , విద్యుత్, ఉపాధి హామీలో పండ్ల మొక్కల పెంపకం బిల్లులు ,ఇల్లు, పింఛన్లు ,సంక్షేమ పథకాల అమలు, ఆస్తి తగాదాలు ఇతర స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ...ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఈ ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.

ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పంచాయతీ రాజ్ లో పదోన్నతి పొందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిని శాలువతో సన్మానించి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు , ఎస్ ఐ మల్లిఖార్జున రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు మండల కన్వీనర్ జయచంద్ర , మెలే శంకర్ , గోపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబుల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు శివారెడ్డి ,మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు నిజాం కంచిసురేష్, ప్రభుత్వ అధికారులు ఏపీడీ రమేష్ బాబు,తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి,మారుతీ ప్రసాద్ ,మనోజ్ కుమార్,ఎంపీడీవోలు శకుంతల ,శివప్రసాద్ రెడ్డి ,అంజనప్ప , ఈఓఆర్డిఓలు , పి ఆర్ ,ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ ,వ్యవసాయం, ఎన్ ఆర్ ఈ జీ ఎస్ , డిఆర్డిఏ వెలుగు, ఐసిడిఎస్ ,ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News