NP Kunta: ఎన్‌పీ కుంట అర్హులైన రైతులకు భూ పట్టాలు ఇవ్వాలి
NP Kunta: ఎన్‌పీ కుంటలో రైతు రక్షణ యాత్ర. దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులకు భూ పట్టాలు పంపిణీ చేయాలని నిరసన. డిమాండ్ చేసిన రైతు రక్షణ సమితి అధ్యక్షుడు రాజేష్.
NP Kunta: ఎన్‌పీ కుంట అర్హులైన రైతులకు భూ పట్టాలు ఇవ్వాలి
ఎన్‌పీ కుంట: సత్యసాయి జిల్లా ఎన్‌పీ కుంట మండలంలో ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న అర్హులైన రైతులకు వెంటనే భూ పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ, రైతు రక్షణ సమితి అధ్యక్షుడు యాదల్ల రాజేష్ ఆధ్వర్యంలో నేడు ఎదురుదోన మరియు మేకలచెరువు పంచాయతీలలో ప్రచార రథంతో రైతు రక్షణ యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లోని రైతులు, ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, భూ పట్టాల కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో పలువురు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, "కాళ్లకు ఉన్న చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా, ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదు" అని వాపోయారని తెలిపారు.
ఈ సందర్భంగా యాదల్ల రాజేష్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా సాగు చేస్తున్న అర్హులైన రైతులకు వెంటనే భూ పట్టాలు ఇవ్వాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి మరింత విస్తృతంగా, భారీ స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రమేష్,వెంకటేష్, మహేంద్ర , గణేష్ రైతులు, గ్రామ పెద్దలు, యువకులు, రైతు రక్షణ సమితి నాయకులు పాల్గోన్నారు