Kadiri: సమస్యల తక్షణ పరిష్కారానికి ఎమ్మెల్యే కందికుంట ఆదేశం!
Kadiri: గాండ్లపెంట మండలం కటారుపల్లి సచివాలయంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజా దర్బార్. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.
Kadiri: సమస్యల తక్షణ పరిష్కారానికి ఎమ్మెల్యే కందికుంట ఆదేశం!
Kadiri: గాండ్లపెంట మండలం, కటారుపల్లి గ్రామ సచివాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యలను స్థానిక ప్రజలు వినతిపత్రాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కావాలని అధికారులకు ఆదేశించారు,దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తన కృషి నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే అన్నారు.