Adilabad: ఆదిలాబాద్‌లో మోరాయించిన రైల్వే గేట్.. తీవ్ర ట్రాఫిక్ జామ్!
Adilabad: ఆదిలాబాద్‌లోని అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్ వద్ద రైల్వే గేట్ సాంకేతిక లోపంతో ట్రాఫిక్ అరగంట పాటు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Adilabad: ఆదిలాబాద్‌లో మోరాయించిన రైల్వే గేట్.. తీవ్ర ట్రాఫిక్ జామ్!
అదిలాబాద్: పట్టణంలో సాంకేతిక కారణంతో రైల్వే గేటు మో రాయించడం తో అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్ ప్రాంతంలో రాకపోకలు అర గంటకు పైగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది... ఉదయం 11 గంటల ప్రాంతంలో ట్రైన్ ఇంజన్ వస్తున్న సమాచారంతో సిబ్బంది రైల్వే గేటు మూసివేయగా, అనంతరము గేట్ ఓపెన్ కాకపోవడం సాంకేతిక ఇబ్బంది కారణంగా దాదాపు అర గంటసేపు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.. అదిలాబాద్ నుండి తాన్సీ తరమడుగు మండలంలో తో పాటు మహారాష్ట్ర కు అంతర్రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ మార్గంలో ఇప్పటికే రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సాగుతుండగా ప్రతిరోజు కూడా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతుండగా, ఈరోజు రైల్వే గేటు సాంకేతిక ఇబ్బంది కారణాలు ఓపెన్ కాకపోవడంతో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు.. రైల్వే గేట్ సిబ్బంది అరగంట పాటు శ్రమించి డేట్ ఓపెన్ చేశారు...