Manthani: మంత్రి శ్రీధర్ బాబును కలిసిన నూతన డాక్టర్ల బృందం!

Manthani: ప్రభుత్వ ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, కొత్త గైనకాలజిస్ట్ బృందం మంత్రి శ్రీధర్ బాబును కలిసి మాతా శిశు సంరక్షణ వసతులపై చర్చించారు.

Update: 2026-07-29 17:18 GMT

Manthani: మంత్రి శ్రీధర్ బాబును కలిసిన నూతన డాక్టర్ల బృందం!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ద్వారా ఇటీవల మంథని ప్రభుత్వ ఆస్పత్రికి నియమితులైన గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ గుంట మౌనిక మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంథని ప్రభుత్వ ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ టీవీ రాజశేఖర్ రెడ్డి మంత్రికి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.

గత కొంతకాలంగా మంథనిలోని మాతా శిశు హాస్పిటల్లో గైనకాలజిస్ట్, అనస్థీషియా వైద్యులు లేక గర్భిణీ స్త్రీలు, బాలింతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు వైద్యుల నియమకానికి ఎంతగానో కృషి చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్‌తో పాటు గైనకాలజిస్ట్, అనస్థీషియా వైద్యులకు శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.

మంథని ప్రభుత్వ ఆస్పత్రిలో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించిందని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా మాతా–శిశు హాస్పిటల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, గర్భిణులకు అవసరమైన ప్రసూతి సేవలను స్థానికంగానే అందించి ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మంథని పరిసర గ్రామాల నుంచి వచ్చే గర్భిణులకు ఆస్పత్రిలోనే పూర్తి స్థాయి చికిత్స అందించి, సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని కోరారు.

ఇటీవల ఆస్పత్రిలో నియమితులైన డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ పూర్ణిమ సేవలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఆస్పత్రిలో వైద్య సేవల నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వైద్యులకు సూచించారు.

Tags:    

Similar News