Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలు!
Adilabad: ఆదిలాబాద్‌లో ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరుద్యోగ విధానాలపై విమర్శలు. ఉద్యోగ హామీలు నెరవేర్చాలని ధర్మేందర్ డిమాండ్.
Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలు!
Adilabad: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేందర్ ఆరోపించారు. ఆదివారం ఆదిలాబాద్ లో నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలు ఆయన మాట్లాడారు. ముందుగా పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ ప్రదర్శన చేపట్టారు.
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏటియుసి రాష్ట్ర కార్యదర్శి విలాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్, ఉన్నారు.