Nirmal: నిర్మల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు
Nirmal: నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం. పాల్గొన్న కలెక్టర్ భవేష్ మిశ్రా.
Nirmal: నిర్మల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోనీ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వందేమాతర గీతాన్ని ఆలపించారు.
అనంతరం పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఆయా శాఖల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.