Nirmal: నిర్మల్ మున్సిపల్ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Nirmal: నిర్మల్ మున్సిపాలిటీలో 80వస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ అప్పాల కావ్య, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
Nirmal: నిర్మల్ మున్సిపల్ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Nirmal: నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాజీ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీ పార్క్, ట్యాంక్ బండ్, బుధవార్పేట్ వార్డు నెం.36లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబెర్లు, మున్సిపల్ కమీషనర్, డిఈ హరిభువన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.