Food Delivery Boy: పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో బాయ్.. వీడియో వైరల్

Food Delivery Boy: ఫుడ్ డెలివరీ బాయ్ వినూత్న ఆలోచన

Update: 2024-01-03 06:43 GMT

Food Delivery Boy: పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో బాయ్.. వీడియో వైరల్

Food Delivery Boy: ట్రక్ డ్రైవర్ల సమ్మెతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. పెట్రోల్ లేక ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఇక ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఫుడ్ డెలివరీ చేస్తే తప్ప పూట గడవదు. పెట్రోల్ దొరకక ఫుడ్ డెలివరీ ఆగిపోయింది. దీంతో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ వినూత్న ఆలోచన చేశాడు. జొమాటో డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్ డెలివరీ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైదాబాద్ క్రాస్‌ రోడ్స్ నుంచి చంచల్‌గూడ జైలు వైపు వెళ్తున్న బాయ్‌ను వాహనదారులు పలకరించారు. పెట్రోల్ లేకపోవడంతో గుర్రంపై ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు వెల్లడించాడు.


Tags:    

Similar News