YS Vijayamma: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న వైఎస్‌ విజయమ్మ

YS Vijayamma: షర్మిల టెర్రరిస్ట్ కాదు.. వేల మందితో వెళ్లలేదు కదా

Update: 2023-04-24 08:52 GMT

YS Vijayamma: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న వైఎస్‌ విజయమ్మ

YS Vijayamma: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. షర్మిలను కలిసేందుకు పీఎస్‌ వెళ్లిన విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్‌పై విజయమ్మ చేయిచేసుకున్నారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోందని.. ఆమెను ఎందుకు అరెస్ట్‌ చేశారని విజయమ్మ ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడే గొంతుకను అరెస్ట్‌ చేస్తారా? అని నిలదీశారు. పోలీసులకు చేతనైన పని షర్మిలను అరెస్ట్ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.


Full View


Tags:    

Similar News