YS Sharmila: బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్
YS Sharmila: నిరుద్యోగ సమస్యపై కలిసిపోరాడుదామన్న షర్మిల
YS Sharmila: బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్
YS Sharmila: టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగ సమస్యపై కలిసిపోరాడుదామని YSR TP అధ్యక్షురాలు పిలుపునిచ్చారు. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమని చెప్పిన షర్మిల.. ప్రగతిభవన్ మార్చ్‌కు పిలుపునిద్దామని సూచించారు. కలిసి పోరాడకపోతే తెలంగాణలో ప్రతిపక్షాలను కేసీఆర్ బతకనివ్వడని షర్మిల చెప్పారు. దీనిపై ఉమ్మడి పోరాటానికి బండి సంజయ్ మద్దతు తెలిపారు. త్వరలో సమావేశమవుదామని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షాలు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.