YS Sharmila: బెంగళూరులో డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ
YS Sharmila: కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన డీకేకు షర్మిల శుభాకాంక్షలు
బెంగళూరులో డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ
YS Sharmila: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీకేకు షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాక.. షర్మిల బెంగళూరుకు వెళ్లడం ఇది రెండో సారి అని తెలుస్తోంది. తాజా భేటీ.. రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైస్సార్టీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అయితే డీకేను కేవలం మర్యాదపూర్వకంగానే కలిసినట్టు చెబుతున్నారు షర్మిల. డీకే శివకుమార్ కుటుంబంతో షర్మిలకు చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే షర్మిల.. బెంగళూరు వెళ్లి ప్రత్యేకంగా డీకేను కలిసినట్టు చెబుతున్నారు.