YS Sharmila: తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది
YS Sharmila: బాలికను వాహనంలో గ్యాంగ్ రేప్ చేసినా పట్టించుకున్న నాధుడే లేడు
YS Sharmila: తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది
YS Sharmila: తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. రాష్ట్రంలో మహిళలపై హత్యాచారాలు, కిడ్నాప్‌లు పెరుగుతున్నాయన్నారు. కేసీఆర్ పాలనలో మహిళకు రక్షణ కరువైందని.. షీ టీమ్స్, సీసీ కెమెరాలు ఉన్నా లాభం లేకుండా పోయిందన్నారు. ఒక బాలికను వాహనంలో గ్యాంగ్ రేప్ చేసినా పట్టించుకునే నాధుడే లేరన్నారు షర్మిల. ఇంత జరుగుతున్నా బీఆర్‌ఎస్‌లో ఉన్న మహిళా నేతలు మాట్లాడటం లేదని.. కవిత కూడా మహిళల కోసం గళం విప్పడం లేదన్నారు. మహిళా కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు షర్మిల. రెండ్రోజులుగా మహిళా కమిషన్ అపాయింట్‌మెంట్ అడుగుతున్నా ఇవ్వడం లేదని.. ఈరోజు అందుబాటులో లేరన్నారు. రాష్ట్ర మహిళ కమిషన్ మాకు భరోసా ఇస్తారనుకున్నామని.. కానీ మహిళ కమిషనర్ లేరని తెలిపారు. అవసరమైతే జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తామన్నారు షర్మిల.