YS Sharmila: కేసీఆర్ సర్కార్ మారితేనే ప్రజల బతుకులు బాగుపడతాయి
YS Sharmila: ఎనిమిదిన్నర ఏళ్ల పాలనలో ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదు
YS Sharmila: కేసీఆర్ సర్కార్ మారితేనే ప్రజల బతుకులు బాగుపడతాయి
YS Sharmila: కేసీఆర్ సర్కారు మారితేనే ప్రజల బతుకులు బాగుపడతాయని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదని..పైగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలో 240వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిల..ఇప్పటివరకు 3800 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలంలోని బంజర క్రాస్ రోడ్, సంధ్య తండా, నరసింహులగూడెం క్రాస్ రోడ్, ఆలేరు, వావిలాల, బోరింగ్ తండా వరకు యాత్ర కొనసాగింది. దారిపొడవునా షర్మిలకు రైతులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికి రెండుసార్లు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చినా రాష్ట్రాన్ని మాత్రం బాగుచేయలేదని..ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని షర్మిల విమర్శించారు.