Na Anveshana: అన్వేష్‌కు ఎదురు దెబ్బ.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు
Naa Anveshana: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి కచ్చితంగా తెలిసే పేరు అన్వేష్. ప్రపంచ యాత్రికుడు పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేసే అన్వేష్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
Na Anveshana: అన్వేష్‌కు ఎదురు దెబ్బ.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు
Naa Anveshana: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి కచ్చితంగా తెలిసే పేరు అన్వేష్. ప్రపంచ యాత్రికుడు పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేసే అన్వేష్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇటీవల బెట్టింగ్ యాప్స్‌పై వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
అన్వేష్ చేసిన పనికి పలువురు ప్రశంసలు సైతం కురిపించారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ పనికి అడ్డంగా ఇరుక్కు పోవాల్సి వచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆయన చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ సీఎస్ శాంతకుమారి, మెట్రో MD ఎన్‌వీఎస్ రెడ్డి, డీజీపీ అంజని కుమార్, ఇతర ఉన్నతాధికారులపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.
బెట్టింగ్ యాప్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించిందంటూ, అధికారులు లంచాలు తీసుకున్నారని పేర్కొంటూ ఆయన వీడియో విడుదల చేశాడు. కానీ ఈ ఆరోపణలతోపాటు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో కేసు నమోదైంది. అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో అన్వేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
వీడియోలో ఉపయోగించిన భాష కూడా అభ్యంతకరంగా ఉండడంతో ఇది మరింత వివాదాస్పదమైంది. అన్వేష్ ఆరోపణల ప్రకారం.. మూడు ప్రముఖ బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించేందుకు అధికారులు రూ.300 కోట్లు లంచం తీసుకున్నారని పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా, డీజీపీ పేరును వెల్లడించి తీవ్ర ఆరోపణలు చేశాడు.
గతంలో బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యూట్యూబర్‌కు మంచి మద్దతు లభించినా, ఇప్పుడు హద్దులు దాటి, వ్యవస్థపైనే దుష్ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అన్వేష్‌పై నమోదైన కేసులో కొన్ని సెక్షన్లు నాన్ బెయిలబుల్ కావడంతో, ఇది అతనికి పెద్ద సమస్యగా మారింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.