VC Sajjanar: పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే!?

VC Sajjanar: సోషల్ మీడియా పాపులారిటీ కోసం యువత ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర పనులు చేస్తున్న దుస్థితిని మరోసారి మనం చూస్తున్నాం.

Update: 2025-07-22 06:47 GMT

VC Sajjanar: పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే!?

VC Sajjanar: సోషల్ మీడియా పాపులారిటీ కోసం యువత ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర పనులు చేస్తున్న దుస్థితిని మరోసారి మనం చూస్తున్నాం. వైరల్ అయ్యే వీడియోలు కోసం రిస్క్‌ తీసుకోవడం, ఓవర్ నైట్ ఫేమ్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అలాంటి ఓ వీడియోపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకుని, తనపై నుంచి రైలు పోతుండగా వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన చూసిన సజ్జనార్ తీవ్రంగా స్పందిస్తూ, ఇటువంటి తిక్క పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం యువత ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. రీల్స్ చేసేందుకు ఇదో ప్రమాదకరమైన మార్గం. ఇలాంటి వీడియోలు చేయడం ముందు ఎటువంటి ఆలోచన లేదు. ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎదుర్కొనే బాధను కూడా ఊహించుకోలేరు. సోషల్ మీడియా మత్తులో మునిగిపోయిన ఈ మానసిక స్థితి కలిగిన వారిని కౌన్సిలింగ్‌కి పంపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరిన్ని ప్రమాదకర వీడియోల కోసం వాళ్లు ఇంకెన్ని వెర్రి పనులు చేస్తారో చెప్పలేము" అంటూ సజ్జనార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. వైరల్ అయ్యే కంటే ముందు, ప్రాణాల విలువను గుర్తించాలనే హితవు పలుకుతున్నారు.


Tags:    

Similar News