పెళ్లి కావడం లేదని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లికావడంలేదన్న మనస్థాపంతో రేపల్లె ఎక్స్‌ప్రెస్ కిందపడి సూసైడ్ చేసుకున్నాడు ఓ యువకుడు. మృతుడు బూర నరేష్‌గా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
నరేష్ స్వస్థలం వరంగల్ జిల్లా ఆత్మకూరుగా తెలుస్తోంది. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ.. బట్టలషాపులో నరేష్ ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. అయితే.. గత నాలుగేళ్లుగా తనకు పెళ్లి సంబంధాలు కుదరడంలేదని నరేష్ తీవ్ర మనస్థాపానికి గురైనట్టు అతని సహచరులు చెబుతున్నారు. ఈ కారణంతోనే నరేష్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.