New Voters: గ్రేటర్ పరిధిలో పెరిగిన యువ ఓటర్లు
New Voters: కొత్త ఓటర్లలో ఎక్కువ మంది తొలిసారి పొలింగ్‌లో పాల్గొంటున్న యువత
New Voters: గ్రేటర్ పరిధిలో పెరిగిన యువ ఓటర్లు
New Voters: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కొత్త యువ ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో ఈ సారికొత్త ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. హైదరాబాద్ లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పక్షాలకు కంచుకోటగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరుగులేని శక్తిగా తయారయ్యాయి. ప్రతిసారి పోలింగ్ శాతం సగానికి మించనప్పటికీ పోలైన ఓటింగ్ లో సగం ఓట్లు దక్కించుకున్న అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తున్నారు.
పార్టీల సంప్రదాయ సెంటిమెంట్, లబ్ది పొందిన వారు, ప్రలోభాలకు గురయిన వారు, రాజకీయ పార్టీల సానుభూతి పరులు మాత్రమే ఓటింగ్ లో పాల్గొంటున్నారు. మిగతా తటస్త ఓటర్లు పెద్దగా ఓటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడంలేదు. చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఫలితం వన్ సైడ్ అవుతోంది, అయితే ప్రతీ ఓటు ప్రాధాన్యం కలిగేదే. ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతోంది.
రాష్ట్ర మొత్తం మీద 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మాజిక్ ఫిగర్ 60 స్థానాలు. గ్రేటర్ పరిధిలోని 24 శాతం సీట్లు అత్యంత కీలకమైనవి. పాత బస్తీలో మజ్లిస్ కి గ్యారెంటీగా ఆరేడు సీట్లు వస్తాయి. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటా పోటీ ఉంది. పాతబస్తాలో 35శాతం మంది ముస్లిం ఓటర్లు, 20 శాతం మంది హిందూ ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
గ్రేటర్ పరిధిలో ఈసారి యువ ఓటర్లు అధికంగా పెరిగారు. 2లక్షల,71 వేల 84 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. హైదరాబాద్ జిల్లాలో 77 వేల5 వందల 22 మంది, రంగారెడ్డి జిల్లాలో 92వేల 540 మంది, మేడ్చల్, మల్కజ్ గిరి జిల్లాలో లక్షా నూట 22 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. వీరిలో ఎక్కువ మంది మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల సంఘం ఓటర్లలో పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమం నిర్వహించింది. దీంతో షారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తుంది.