ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికేఉంటా.. కన్నీరు పెట్టిస్తున్న యువ వైద్యుడి కవిత..

TS News: నిఖిల్ కోరిక మేరకు ఐదురుగురికి అవయవ దానం

Update: 2023-05-04 09:59 GMT

చనిపోయి కూడా ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు.. కన్నీరు పెట్టిస్తున్న యువ వైద్యుడి కవిత..

Wanaparthy: వనపర్తి జిల్లా అమరచింతలో విషాదం చోటుచేసుకుంది. బెంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమరచింతకు చెందిన యువ వైద్యుడు నిఖిల్ బ్రెయిన్ డెడ్ అయింది. ఈ ప్రమాదంలో నిఖిల్ తలకు బలమైన గాయాలు కాగా బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు తెలిపారు.

అయితే తాను జీవించిలేకున్నా తన అవయవాలు వేరొకరికి ఉపయోగపడాలని భావించిన నిఖిల్ విద్యార్థి దశలోనే అవయవ దానానికి సమ్మతి తెలపాడు. తనతో పాటు మరికొంత మంది అవయవ దానానికి ముందుకు రావాలని కవితను కూడా రాశాడు. కుమారుడి కోరిక మేరకు అవయవదానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. ప్రత్యేకంగా అంబులెన్స్‌ ఏర్పాటు చేసి నిఖిల్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ఆరుగురికి అవయవదాతగా నిలిచారు.

నిఖిల్‌ రాసిన కవిత ఇదీ..

నా తనువు మట్టిలో కలిసినా..

అవయవదానంతో మరొకరిలో జీవిస్తా..

ఒక అమ్మకు బిడ్డగా మరణించినా..

మరో అమ్మ పిలుపులో బతికేఉంటా..

ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు..

ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె

కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు

ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు

కాలేయం పనిచేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం నాలోని ప్రతి అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి..

ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి

ఇదే మీరు నాకు ఇచ్చే గొప్ప బహుమతి

ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను, చిరంజీవినై ఉంటాను

అవయవదానం చేద్దాం..

మరో శ్వాసలో శ్వాసగా ఉందాం

Tags:    

Similar News